మెగా హీరో జోడీగా 'పెళ్లి సందD' హీరోయిన్?
- 'పెళ్లి సందD'తో పరిచయమైన నాయిక
- గ్లామర్ పరంగా మంచి మార్కులు
- యూత్ లో పెరుగుతున్న క్రేజ్
- రవితేజ సరసన దొరికిన ఛాన్స్
రాఘవేంద్రరావు పరిచయం చేసిన కథానాయిక గురించి పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరం లేదనే విషయం అందరికీ తెలిసిందే. అందువలన ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయట. తాజాగా ఆమె మరో సినిమాను ఒప్పుకుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది.
తెలుగులో తన రెండో సినిమాగా శ్రీలీల .. రవితేజ సరసన 'ధమాకా' చేస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఇక ఆ తరువాత సినిమాను మెగా ఫ్యామిలీ హీరోతో చేయనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. మరి మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో చేయనుందో .. ఈ సినిమాకి దర్శక నిర్మాతలు ఎవరో త్వరలోనే తెలియనుంది.