తీర్థయాత్రలు ముగిశాయంటూ ఫొటో పోస్ట్ చేసిన సమంత!
- తన స్నేహితురాలితో కలిసి తీర్థయాత్రలు
- చార్‌ధామ్ యాత్రలో భాగంగా పుణ్యక్షేత్రాల సందర్శన
- యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌లలో పూజలు
హిమాలయాల్లో యాత్రలు చేయడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటున్నానని తెలిపింది. తన హృదయంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉందంటూ ఆమె పేర్కొంది.
కాగా, తీర్థయాత్రలో భాగంగా దిగిన ఫొటోలను శిల్పారెడ్డి కూడా ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.