నా బిడ్డ పాదయాత్ర చేస్తోంది... మీ అందరి ఆశీస్సులు కావాలి: వైఎస్ విజయమ్మ
- తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ
- రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రస్థానం
- ఈ నెల 20 నుంచి మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర
- షర్మిలను తొలి అడుగు వేస్తోందన్న విజయమ్మ
తన బిడ్డ షర్మిల ఈ నెల 20న చేవెళ్ల నుంచి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలి అడుగు వేస్తోందని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ షర్మిలను ఆదరించాలని కోరారు. పాదయాత్ర సందర్భంగా ఆమె అడుగులో అడుగు వేయాలని, చేతిలో చేయి కలపాలని, రాజన్న సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవాలని విజయమ్మ పిలుపునిచ్చారు.