Grandhi Srinivas: ​పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్

YCP MLA Grandhi Srinivas slams Pawan Kalyan
  • పవన్ ది వింత వ్యక్తిత్వం అన్న ఎమ్మెల్యే
  • ఎప్పుడెలా మాట్లాడతాడో తెలియదని వ్యాఖ్యలు
  • ఓ నటికి అబార్షన్ చేయించాడని ఆరోపణ
  • రూ.5 కోట్లతో సెటిల్ చేశాడని వెల్లడి
వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ది ఒక వింత వ్యక్తిత్వం అని విమర్శించారు. రాజమండ్రిలో కానిస్టేబుళ్లను తిట్టిన నోటితోనే, అనంతపురం వెళ్లి మా నాన్న కూడా కానిస్టేబుల్ అంటాడని వ్యాఖ్యానించారు. గతంలో ఓ సినీ నటికి అబార్షన్ చేయించి, ఐదు కోట్ల రూపాయలతో వ్యవహారం సద్దుమణిగేలా చేశాడని చెప్పుకుంటున్నారని అన్నారు. పవన్ కు ముగ్గురు భార్యలన్న విషయం మాత్రమే బయటికి తెలుసని, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారోనని ఎద్దేవా చేశారు.

గతంలో పవన్ తన అస్థికలను దేశమంతా చల్లితే తనలాంటివాళ్లు జన్మిస్తారనడం సిగ్గుపడాల్సిన విషయమని, జనసైనికులు, వీరమహిళలు అంత చేతగానివాళ్లా? అని గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ ఎప్పుడెలా ఉంటాడో, ఎలా మాట్లాడతాడో ఎవరికీ తెలియదని విమర్శించారు. రెండ్రోజులు రాష్ట్రంలో తిరిగాడంటే అల్లకల్లోలమే అని వ్యాఖ్యానించారు.
Grandhi Srinivas
Pawan Kalyan
YSRCP
Janasena

More Telugu News