'వరుణ్ డాక్టర్' ప్రతి ఒక్కరినీ థ్రిల్ చేస్తాడు: శివకార్తికేయన్

Varun Doctor Movie update
  • ఆర్మీ డాక్టర్ గా కనిపిస్తాను
  • ప్రతి సీన్ థ్రిల్ చేస్తుంది
  • మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది
కోలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యువ కథానాయకులలో శివ కార్తికేయన్ ఒకరుగా కనిపిస్తాడు. కొన్ని అనువాద సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తమిళనాట ఆయన తాజా చిత్రంగా 'డాక్టర్' సినిమా రూపొందింది. శివ కార్తికేయన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

శివ కార్తికేయన్ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులో 'వరుణ్ డాక్టర్' అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి శివకార్తికేయన్ మాట్లాడాడు.

"వరుణ్ ఒక ఆర్మీ డాక్టర్ .. కొన్ని కారణాల వలన ఆయన తన సొంత ఊరు వస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది? అప్పుడతను ఏం చేస్తాడు? అనేదే కథ. హీరోకి .. విలన్ కి మధ్య నడిచే మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీలవుతారు" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Shiva Karthikeyan
Priyanka Arul Mohan

More Telugu News