గత రాత్రి అదృశ్యమైన విశాఖ బాలిక.. చివరికి విగతజీవిగా కనపడిన వైనం
- విశాఖలోని అగనంపూడిలోని శనివాడలో ఘటన
- అపార్ట్‌మెంటు వద్ద పనిచేసుకుంటూ ఉపాధి పొందుతోన్న బాలిక కుటుంబం
- బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళన
ఆ బాలిక విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన ఓ దంపతుల కుమార్తె. ఆ కుటుంబం ఉపాధి కోసం విశాఖలోని అగనంపూడికి వచ్చి ఉంటోంది. అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో ఆ కుటుంబం పనిచేస్తోంది.
ఈ ఘటనపై కూర్మన్నపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.