Sharwanand: డబ్బింగ్ పనులు పూర్తిచేసిన 'మహా సముద్రం'

Dubbing done for Maha Samudram
షార్ట్స్‌లో చూడండి
అజయ్ భూపతి తాజా చిత్రంగా అనిల్ సుంకర నిర్మాణంలో 'మహా సముద్రం' నిర్మితమైంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఆ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేసింది.

ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ .. సిద్ధార్థ్ సరసన అదితీరావు నటించారు. ఇక జగపతిబాబు .. రావు రమేశ్ కీలకమైన పాత్రలను పోషించారు. 'గరుడ' రామ్ పోషించిన పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అజయ్ భూపతి మొదటి చిత్రంగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' సూపర్ హిట్ గా నిలిచింది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ ను ఆవిష్కరించడంలో ఆయన తనదైన మార్క్ చూపించాడు. ఇక ఇప్పుడు యాక్షన్ ను కూడా జోడించి ఆయన అందిస్తున్న 'మహా సముద్రం' ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.
Go Back to Shorts
Sharwanand
Siddharth
Anu Emmanuel
Adithi Rao

More Telugu News