ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- యూపీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
- కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతుల మృతి
- బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక
ఈ నేపథ్యంలో పోలీసులపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంటి నుంచి బయటకురావడం నేరం కాదని అన్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారి బాధను పంచుకోవడానికి వెళ్తున్నానని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే వారంట్ చూపించి కారును ఆపాలని అన్నారు. ఈ దేశం బీజేపీది కాదని... ఈ దేశం రైతులదని చెప్పారు. ఒకవేళ తనను బలవంతంగా పోలీసు కారులో ఎక్కిస్తే మీపై కిడ్నాప్ కేసు పెడతానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.