పవన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ అనవసరంగా పెద్దవాడిని చేస్తున్నారు: ధర్మాన కృష్ణదాస్
- పవన్ కు రాజకీయ చతురత లేదు
- రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు
- సినీ పరిశ్రమ వ్యక్తులే ఆయనను వ్యతిరేకిస్తున్నారు
తిరుపతి లోక్ సభ ఎన్నికలో బీజేపీతో కలిసి ప్రయాణిస్తూనే టీడీపీకి ఓట్లు వేయించారని విమర్శించారు. నామమాత్రంగా ఓటు వేయించే శక్తి మాత్రమే పవన్ కు ఉందని అన్నారు. రాజకీయ పార్టీని పెట్టి తనకున్న అభిమానులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాడని దుయ్యబట్టారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులే పవన్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని అన్నారు.