రేపు మహేశ్ బాబు చేతుల మీదుగా 'పెళ్లి సందD' ట్రైలర్!
- రోషన్ హీరోగా రూపొందిన 'పెళ్లి సందD'
- కథానాయికగా శ్రీలీల పరిచయం
- రేపు ఉదయం 11 గంటలకు ట్రైలర్ రిలీజ్
- ముఖ్యమైన పాత్రలో రాఘవేంద్రరావు
గతంలో ఆయనతో 'పెళ్లి సందడి' సినిమాకి పనిచేసిన కీరవాణి - చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. ఇక ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ సినిమాతో శ్రీలీల తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. శ్రీకాంత్ మాదిరిగానే ఆయన తనయుడికి ఈ టైటిల్ కలిసొస్తుందేమో చూడాలి.