అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆశ్చర్యపరుస్తున్న 'లవ్ స్టోరీ'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆశ్చర్యపరుస్తున్న 'లవ్ స్టోరీ'

Love Story Advance Bookings
  • 'లవ్ స్టోరీ'కి విపరీతమైన క్రేజ్
  • ఈ నెల 24వ తేదీన థియేటర్లకు
  • మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్
  • క్షణాల్లో అమ్ముడవుతున్న టికెట్లు    
సెకండ్ వేవ్ తరువాత సినిమా థియేటర్లు ఓపెన్ చేసి చాలా రోజులే అయింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకునే కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి, తమ సినిమాలను థియేటర్లకు తీసుకొచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో థియేటర్ల దగ్గర సందడి మాత్రం కనిపించలేదు.

ఈ మధ్య కాలంలో థియేటర్ల దగ్గర పట్టుమని ఓ పది రోజులు నిలబడిన సినిమా ఏదైనా ఉందీ అంటే అది 'సీటీమార్' అనే చెప్పుకోవాలి. మాస్ అంశాలు పుష్కలంగా ఉండటం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీన 'లవ్ స్టోరీ' రంగంలోకి దిగుతోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోందని అంటున్నారు. ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినా, క్షణాల్లో టికెట్లు అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని చాలా మల్టిప్లెక్స్ లలో మొదటి రోజు షోలకు సంబంధించిన బుకింగ్స్ చాలావరకూ జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాతో థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టేనని చెప్పుకుంటున్నారు.
Nagachaitanya
Sai Pallavi
Sekhar kammula

More Telugu News