దూసుకుపోతున్న 'లవ్ స్టోరి' ట్రైలర్!
- శేఖర్ కమ్ముల నుంచి 'లవ్ స్టోరీ'
- హీరోహీరోయిన్లుగా చైతు, సాయిపల్లవి
- సంగీత దర్శకుడిగా పవన్ సీహెచ్
- ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
మొదటి నుంచి ఈ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇందుకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఒక వైపు హీరో .. మరో వైపు హీరోయిన్ జీవితంలో తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇద్దరూ ప్రయత్నించి, చివరికి కలిసి పోరాడాలనే నిర్ణయానికి రావడం ఈ ట్రైలర్ లో చూపించారు. కథలోని సారాంశాన్ని ఈ ట్రైలర్ తో చెప్పేశారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఈశ్వరీరావు .. దేవయాని ముఖ్యమైన పాత్రలను పోషించారు.