ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును బుజ్జగించే పనిలో బీసీసీఐ!
- టీమిండియా, ఇంగ్లండ్ ఐదో టెస్టు రద్దు
- టీమిండియా ఓడినట్టు ప్రకటించాలంటున్న ఈసీబీ
- టెస్టు రీషెడ్యూల్ కు బీసీసీఐ మొగ్గు
- జులైలో రెండు అదనపు టీ20లు ఆడతామని ప్రతిపాదన
ఈ క్రమంలో గరంగరంగా ఉన్న ఈసీబీని బుజ్జగించేందుకు బీసీసీఐ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వచ్చే జులైలో ఇంగ్లండ్ తో 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇప్పటికే ఫిక్స్ కాగా, అదనంగా మరో రెండు టీ20లు కూడా ఆడతామని భారత క్రికెట్ బోర్డు ఆఫర్ చేసింది. ఐదో టెస్టు రద్దుతో జరిగిన నష్టాన్ని, ఈ రెండు అదనపు టీ20ల ద్వారా భర్తీ చేసుకోండి అంటూ బీసీసీఐ ప్రతిపాదిస్తోంది.
ఈ లేటెస్ట్ ఆఫర్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా నిర్ధారించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? లేదా? అన్నది ఈసీబీకే వదిలేశామని ఆయన తెలిపారు.