9 ఏళ్లకే ముగిసిన శిఖర్ ధావన్-అయేషా ముఖర్జీ ప్రేమ పెళ్లి.. విడిపోయామన్న అయేషా
- ధావన్‌తో వివాహానికి ముందే పెళ్లి.. ఇద్దరు పిల్లలు
- 2012లో ధావన్‌తో వివాహం
- రెండోసారి విడాకుల ఊహే భయంకరంగా ఉందని వ్యాఖ్య
- స్పందించని ధావన్
తాజాగా, తామిద్దరం విడిపోతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన అయేషా.. వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తిమంతమైవని పేర్కొంది. తొలిసారి విడాకులు తీసుకుంటున్నప్పుడు తాను చాలా భయపడ్డానని, జీవితంలో ఓడిపోయినట్టు, తప్పు చేస్తున్న భావన తనను పట్టి పీడించేవని పేర్కొంది.
రెండోసారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదమే తనకు చాలా చెత్తగా అనిపించేదని తెలిపింది. తల్లిదండ్రులను, పిల్లలను చాలా నిరాశకు గురిచేశానని భావించానని, ఇప్పుడు రెండోసారి విడాకుల ఊహే భయంకరంగా ఉందని వివరించింది. అయితే, ఈ విడాకుల విషయమై శిఖర్ ధావన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.