నిఫా వైర‌స్ ఇలా సోకుతుంది: వివ‌రాలు తెలిపిన‌ ఎయిమ్స్ వైద్యుడు

07-09-2021 Tue 10:32 | National
  • గబ్బిలాల వ‌ల్ల‌ ఈ వైరస్ వ్యాప్తి
  • గబ్బిలాలు గుంపులుగా తిరుగుతాయి
  • వాటి నుంచి పందులు, గొర్రెలు వంటి జంతువులకు వైర‌స్
  • ఆ జంతువుల నుంచి మ‌నుషుల‌కు..
  • పండ్ల‌ను క‌డిగి తినాలి
కేర‌ళ‌లో నిఫా వైర‌స్ సోకి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల‌ ఆ బాలుడిని క‌లిసిన 24 మంది శ్యాంపిళ్ల‌ను పూణెలోని వైరాల‌జీ ఇన్‌స్టిట్యూట్‌కి పంపగా వారిలో ఎనిమిది మంది శ్యాంపిళ్ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ ఎనిమిది మందికి నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు ఈ రోజు కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

మిగ‌తా శ్యాంపిళ్ల ఫ‌లితాలు రావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో నిఫా వైర‌స్‌పై ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ అశుతోష్ బిశ్వాస్ స్పందిస్తూ ప‌లు విషయాలు తెలిపారు. గబ్బిలాల వ‌ల్ల‌ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని వివ‌రించారు.

గబ్బిలాలు గుంపులుగా ఒకేచోట ఉంటాయని, అవన్నీ సామూహికంగా ఒక చోటు నుంచి మ‌రో ప్రాంతానికి వెళ్తాయ‌ని చెప్పారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. నిఫా వైరస్‌ను క‌ట్ట‌డి చేసేందుకు తగిన ఔషధం లేదని వివ‌రించారు. నిఫా సోకితే  ప్రాణాపాయం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. నిఫా వైరస్ గబ్బిలాల‌ నుంచి పందులు, గొర్రెలు వంటి జంతువులకు సోకుతుందని, వాటి నుంచి మనుషులకు సోకుతుంద‌ని చెప్పారు. పండ్లను కొని తెచ్చుకున్నాక వాటిని శుభ్రంగా కడిగిన తరువాత తినాల‌ని సూచించారు.
aiimsnipah

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more