Sundeep Kishan: 'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్ ప్రకటన!

Gully Rowdy release date confirmed
షార్ట్స్‌లో చూడండి
యువ హీరోల్లో సందీప్ కిషన్ కూడా తన దూకుడు పెంచుతూ వెళుతున్నాడు. ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా తన జోరును పెంచుతున్నాడు. హీరోగా ఆయన చేసిన 'గల్లీ రౌడీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. ఎంవీవీ సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో నేహా శెట్టి తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉన్నాయట.

 ఈ సినిమాకి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీ సినిమాలు చేయడంలో నాగేశ్వర్ రెడ్డి సిద్ధహస్తుడు. ఇంతకుముందు సందీప్ కిషన్ తో చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి మరి.  
Go Back to Shorts
Sundeep Kishan
Neha Shetty

More Telugu News