Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ మాయాజాలం.. పెరిగిన జెమిని టీవీ రేటింగ్

Jr NTR takes Gemini TV Rating to heights
షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' సీజన్-5 కార్యక్రమం ఇటీవలే జెమినీ టీవీలో ప్రారంభమైంది. తారక్ ఈ కార్యక్రమానికి హోస్ట్ అనే వార్తలు వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ షో దుమ్మురేపింది. తారక్ మేజిక్ జెమినీకి కలిసొచ్చింది. కార్యక్రమం ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.

ఈ కార్యక్రమం ప్రసారమయ్యే స్లాట్ లో జెమినీ టీవీ అత్యధిక రేటింగ్ సాధించింది. జెమిని టీవీ రేటింగ్ 290 జీఆర్పీ నుంచి 400 జీఆర్పీకి వెళ్లింది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తొలి మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా... నాలుగో సీజన్ కు చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుత సీజన్ ను తారక్ హోస్ట్ చేస్తున్నారు.
Go Back to Shorts
Junior NTR
Gemini TV
Rating

More Telugu News