అమెరికా డ్రోన్ దాడుల్లో సాధారణ పౌరులు కూడా చనిపోయారు: తాలిబన్ల ఆగ్రహం
- అమెరికా దాడిలో ఏడుగురి మృతి
- తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపణ
- ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్యలు
- చైనా మీడియాతో జబీహుల్లా ముజాహిద్
"ఆఫ్ఘనిస్థాన్ లో ఏదైనా తీవ్ర ముప్పు ఉంటే మాకు తెలియజేయాలి. అంతేతప్ప ఏకపక్షంగా దాడులు చేయడం తగదు. ఈ ఘటనలో సామాన్య పౌరులు కూడా చనిపోయారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అధికారిక మీడియా సంస్థ సీజీటీఎన్ కు పంపిన లిఖితపూర్వక స్పందనలో జబీహుల్లా ముజాహిద్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడిలో ఏడుగురు చనిపోయినట్టు వెల్లడించారు.