Corona Virus: దేశంలో క్ర‌మంగా పెరుగుతున్న క‌రోనా కేసులు

corona bulletin
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌ క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 46,759 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,49,947కి చేరింది. అలాగే, నిన్న 31,374 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 509 మంది మృతి చెందారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,37,370కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,18,52,802 మంది కోలుకున్నారు. 3,59,775 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న 1,03,35,290 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. దీంతో మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 62,29,89,134 కు చేరింది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News