ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు: సీఎం జగన్ ఆవేదన
- కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష
- ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనల ప్రస్తావన
- చేయగలిగినంత చేశామని వెల్లడి
- స్వార్థ రాజకీయ ప్రయోజనాలు అంటూ వ్యాఖ్యలు
తనతో సహా కలెక్టర్లు, ఎస్పీలు చేయగలిగినంత చేస్తున్నామని, అయినప్పటికీ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లలు, వారి కుటుంబ గౌరవాలను బజారుకీడుస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఓ వర్గం మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని, తాము దానితో కూడా పోరాడుతున్నామని వెల్లడించారు.