రామ్ చరణ్ సినిమాలో మలయాళ హీరో?
- శంకర్ తో రామ్ చరణ్ సినిమా
- హీరోయిన్ గా కియారా అద్వానీ
- జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు
- కీలక పాత్రలో జయరామ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో భాగంగా ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ అప్ డేట్ వినిపిస్తోంది.
అదేమిటంటే.. ప్రముఖ మలయాళ హీరో జయరామ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో ఆయన పాత్ర నెగటివ్ షేడ్స్ తో సాగుతుందని అంటున్నారు. ఆమధ్య జయరామ్ తెలుగులో 'అల వైకుంఠపురములో' చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగతి విదితమే. ఇక శంకర్-చరణ్ సినిమా షూటింగును వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చరణ్ కి ఇది 15వ సినిమా. ఈ చిత్రానికి బిజీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ చేయనున్నాడు.