తాను కొన్న అత్యంత ఖరీదైన కారుతో ఫొటో తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్!
- రూ.5 కోట్లకు పైగా ఖరీదు
- ఫొటోలో ఎన్టీఆర్‌తో పాటు శ్రీకాంత్, సునీల్ కుమార్ చలమలశెట్టి
- తాజాగా డెలివరీ అయిన కారు
ఇటీవలే ఆర్ఆర్ఆర్ ప్రత్యేక పాట షూటింగ్ కోసం తారక్ ఉక్రెయిన్ వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన ఈ కారును బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ లంబోర్ఘినీ తయారు చేసిన ఈ కారు ఇటీవలే అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి డెలివరీ అయింది.
ఈ కారు ధర రూ.5 కోట్ల పైనే ఉంటుంది. ఇది 3.6 సెకన్లలో గంటలకు 100 కిలోమీటర్ల వేగాన్ని, 12.8 సెకన్లలో గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మొత్తానికి ఇది గంటకు 305 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించగలదు. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో వెళ్లగలిగే కారు ఇదే.