సూర్యాపేట జిల్లాలో కాకినాడ వెళుతున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
- సూర్యాపేట జిల్లా ఆకుపాముల సమీపంలో ఘటన
- కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
- అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు
కాగా, బస్సు బోల్తా పడిన సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. అద్దాలు పగలకొట్టుకుని బయటకు వచ్చిన కొందరు ప్రయాణికులు బస్సులో చిక్కుకున్న మిగతా వారిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అతి వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.