ఇక వాట్సాప్ లోనూ కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్
- ఇప్పటివరకు కొవిన్ ద్వారా రిజిస్ట్రేషన్
- వ్యాక్సిన్ కేంద్రాల వద్ద నేరుగానూ టీకా పొందే అవకాశం
- తాజాగా వాట్సాప్ నెంబరు తీసుకువచ్చిన కేంద్రం
- "బుక్ స్లాట్" అని సందేశం పంపితే టీకా పొందే అవకాశం
వాట్సాప్ లోనూ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఓ ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నవారు 90131 51515 నెంబరుకు "బుక్ స్లాట్" అని సందేశం పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.