కల్యాణ్ సింగ్ మృతి నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

Bandi Sanjay Padayatra postponed
  • యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత
  • పాదయాత్ర వాయిదావేసుకున్న బండి సంజయ్
  • త్వరలోనే కొత్త తేదీ ప్రకటన
  • కల్యాణ్ సింగ్ మృతికి సంతాపదినాలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర వాయిదా పడింది. బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతి నేపథ్యంలో తన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టు బండి సంజయ్ వెల్లడించారు. అటు, మాజీ సైన్యాధికారులు బీజేపీలో చేరే కార్యక్రమం కూడా వాయిదా పడిందని తెలిపారు.

కల్యాణ్ సింగ్ మృతి తీరని లోటు అని, పార్టీ తరఫున సంతాప దినాలు పాటిస్తామని బండి సంజయ్ వివరించారు. కల్యాణ్ సింగ్ క్రమశిక్షణకు మారుపేరు అని వెల్లడించారు. బండి సంజయ్ ఆగస్టు 24 నుంచి పాదయాత్ర చేసేందుకు ఇటీవల నిర్ణయించారు. పాదయాత్ర వాయిదా పడిన నేపథ్యంలో కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
Padayatra
Postpone
Kalyan Singh
Demise
BJP
Telangana

More Telugu News