రాఖీబంధన్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, షర్మిల
- బాంధవ్యాలను తెలిపే పండుగే రక్షాబంధన్ అన్న పవన్
- అడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధను కలిగిస్తున్నాయని వ్యాఖ్య
- ప్రతి అన్న, తమ్ముడు సంతోషంగా ఉండాలన్న షర్మిల
తన తోడబుట్టిన జగనన్నకు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తనకు అండగా నిలిచిన, తాను ఎంచుకున్న మార్గంలో తనతో కలిసి నడుస్తున్న, తన ఆశయ సాధనలో తనను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖసంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని షర్మిల చెప్పారు.
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. అన్ని విషయాల్లో సగభాగమైన మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగుతుండటం బాధను కలిగిస్తోందని అన్నారు. ఆడవారు అబలలు కాదు సబలలు అని నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.