పన్నులు తగ్గిస్తాం సరే.. మరి, మీరేం చేస్తారు?: టెస్లాను వివరణ కోరిన కేంద్రం
- ఉత్పత్తి ప్రణాళికను ఇవ్వాలని ఆదేశం
- సగం తయారు చేసిన వాహనాల దిగుమతిపై ప్రశ్నలు
- అలాగైతే పన్నులు తగ్గుతాయని టెస్లాకు సూచన
ఏం చేయదలచుకున్నారో సవివరంగా చెప్పాలంటూ టెస్లాను కేంద్రం కోరిందంటున్నారు. అంతకన్నా ముందు స్థానికంగా వాహనాల సమీకరణలో వేగం పెంచాల్సిందిగా సూచించిందని తెలుస్తోంది.
గత సమావేశంలోనే ఈ వివరాలను టెస్లాకు కేంద్రం తెలియజేసిందని ఆ అధికారి చెబుతున్నారు. పూర్తిగా తయారు చేసిన కార్లు లేదా సగం తయారు చేసి.. మిగతా సగాన్ని భారత్ లో అసెంబుల్ చేసే దానిపైనా అభిప్రాయం చెప్పాల్సిందిగా టెస్లాకు సూచించారని అంటున్నారు. దాని వల్ల దిగుమతి సుంకం తగ్గుతుందని చెప్పినట్టు సమాచారం. దీనిపై టెస్లా నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.