సానుభూతి కోసమే ఈటల అనేక రకాల నాటకాలాడుతున్నారు: బాల్క సుమన్
- గెలుపు కోసం ఈటల రాజేందర్ ఎన్ని ఎత్తులు వేసినా మేమే గెలుస్తాం
- కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తోన్న అభివృద్ధి, సంక్షేమం ముందు అవి పనికిరావు
- హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈటలపై విమర్శలు గుప్పించారు. సానుభూతి కోసమే ఈటల అనేక రకాల నాటకాలాడుతున్నారని ఆరోపించారు. గెలుపు కోసం ఈటల రాజేందర్ ఎన్ని ఎత్తులు వేస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తోన్న అభివృద్ధి, సంక్షేమం ముందు అవి పనికిరావని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుపు ఖాయమైందని చెప్పుకొచ్చారు.