అమీర్‌పేట మెట్రో స్టేషన్లో బాంబు కలకలం.. పరుగులు పెట్టిన బాంబ్ స్క్వాడ్
- అనుమానిత వస్తువు ఉన్నట్టు పోలీసులకు ఫోన్
- చెత్తడబ్బాలో కనిపించిన పనిచేయని సెల్‌ఫోన్
- ఊపిరి పీల్చుకున్న మెట్రో సిబ్బంది, ప్రయాణికులు
వారి నుంచి సమాచారం అందుకున్న బాంబ్‌స్క్వాడ్, ఎస్సార్ నగర్ పోలీసులు క్షణాల్లోనే స్టేషన్‌కు చేరుకుని తనిఖీ చేశారు. చివరికి పోలీసు జాగిలం సాయంతో చెత్తడబ్బాలో గాలించగా సెల్‌ఫోన్ లభ్యమైంది. ఆ ఫోన్ పనిచేయకపోవడంతో దానిని చెత్తడబ్బాలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాంబు లేదని తెలియడంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.