సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Tamanna signs for another web series
  • హిందీలో వెబ్ సీరీస్ చేస్తున్న తమన్నా
  • చరణ్, శంకర్ సినిమా తొలి షెడ్యూలు  
  • విలన్ పాత్రలో సంగీత దర్శకుడు  
*  తమన్నా ఇప్పుడు వెబ్ సీరీస్ లతో కూడా బిజీ అవుతోంది. ఇప్పటికే 'నవంబర్ స్టోరీ', 'లెవెన్త్ అవర్' వంటి వెబ్ సీరీస్ లలో నటించిన తమ్మూ తాజాగా హిందీలో ఓ వెబ్ సీరీస్ చేయడానికి ఓకే చెప్పింది. మాడాక్ ఫిలిమ్స్ నిర్మించే ఈ వెబ్ సీరీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయింది. ఈ నెలలోనే దీని షూటింగ్ మొదలవుతుంది.
*  రామ్ చరణ్, శంకర్ కలయికలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూలును వచ్చే నెల 8 నుంచి హైదరాబాదులో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ఎక్కువ భాగం తెలంగాణలోని వివిధ ప్రదేశాలలో జరుగుతుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
*  ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె మరోసారి నటుడిగా వస్తున్నాడు. హాస్యనటుడు సప్తగిరి హీరోగా రూపొందుతున్న 'గూడుపుఠాణి' చిత్రంలో విలన్ పాత్రలో రఘు కుంచె నటిస్తున్నాడు. గతంలో 'పలాస 1978' చిత్రంలో కూడా రఘు కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే.
Tamannaah
Ramcharan
Shankar
Raghu Kunche

More Telugu News