ఆడపిల్లలకు అర్ధరాత్రి బీచ్ లో ఏం పని?: అసెంబ్లీలో గోవా సీఎం సంచలన వ్యాఖ్యలు
- అర్ధరాత్రి పిల్లలు బయటకు వెళ్తున్నారంటే తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి
- పిల్లలను నిలువరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా?
- ఏదైనా జరిగిన తర్వాత పోలీసులను నిందిస్తే ఎలా?
ఇటీవల ఇద్దరు మైనర్ బాలికలపై గోవాలో అత్యాచారం జరిగింది. ఈ అంశంపై గోవా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, బీచ్ పార్టీకి వెళ్లిన వారిలో అత్యాచారానికి గురైన అమ్మాయిలు తప్ప మిగిలిన వారంతా ఇళ్లకు తిరిగొచ్చారని అన్నారు. తల్లిదండ్రుల మాటను పిల్లలు వినకపోతే... ఆ తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులను ఎలా బాధ్యులను చేయగలమని ప్రశ్నించారు.
మరోవైపు సీఎం వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా? అని మండిపడుతున్నారు. సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.