కొవిడ్ నుంచి కోలుకున్నాక 9 నెలలపాటు యాంటీబాడీలు: తాజా అధ్యయనం
- లక్షణాలు ఉన్నా, లేకున్నా యాక్టివ్‌గానే యాంటీబాడీలు
- 2 వేల మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడి
- లండన్, ఇటలీ శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనం
వైరస్ బారినపడి కోలుకున్న ఇటలీలోని ఓ పట్టణానికి చెందిన 2 వేల మందిని పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. లక్షణాలు ఉన్న వారితోపాటు, లేనివారిలోనూ 9 నెలలపాటు యాంటీబాడీలు క్రియాశీలంగా ఉండడాన్ని తాము గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.