భారత్, శ్రీలంక మధ్య నేడు తొలివన్డే జరిగేనా?
- కాసేపట్లో తొలి వన్డే
- శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్
- వరుణుడు అడ్డంకి సృష్టించే అవకాశం
శ్రీలంకతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు తొలి వన్డే జరగాల్సి ఉంది. అలాగే, ఈ నెల 20, 23న మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం టీ20 మ్యాచులు ప్రారంభమవుతాయి. వన్డేలు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. అలానే టీ20లు ఆయా తేదీల్లో రాత్రి 8 గంటలకి ప్రారంభం కానున్నాయి.