డెల్టా వేరియంట్‌ ముప్పు తొలగిపోలేదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డెల్టా వేరియంట్‌ ముప్పు తొలగిపోలేదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Delta Variant risk still Alive said WHO
  • 111 దేశాల్లో ఉనికిలో డెల్టా వేరియంట్, 178 దేశాల్లో ఆల్ఫా రకం  
  •  ప్రపంచ జనాభాలో నాలుగో వంతు జనాభాకు మాత్రమే తొలి విడత వ్యాక్సిన్
  • సంపన్న దేశాల వద్దే ఎక్కువ వ్యాక్సిన్లు
  • వార్షిక నివేదికలో డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వీక్లీ నివేదికలో హెచ్చరించింది. ఈ వేరియంట్‌తో ముడిపడిన కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 13 నాటికి 111 దేశాల్లో ఈ వేరియంట్ ఉనికి ఉందని, మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

 అలాగే, ఆల్ఫా వేరియంట్ 178 దేశాల్లోనూ, బీటా రకం 123, గామా వేరియంట్ 75 దేశాల్లోనూ ఉనికిలో ఉన్నట్టు వివరించింది. ఆందోళన రకం వైరస్‌లలో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వివరించింది. తక్కువ సంఖ్యలోనూ వ్యాక్సిన్లు పూర్తి కావడంతో ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని నాలుగోవంతు జనాభాకు మాత్రమే తొలి విడత వ్యాక్సిన్ అందిందని, ఈ విషయంలో సంపన్న దేశాలే ఎక్కువ టీకాలు అందుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వివరించింది.
Corona Virus
Delta Variant
WHO

More Telugu News