యాక్షన్ లోకి దిగిపోయిన 'ఏజెంట్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్షన్ లోకి దిగిపోయిన 'ఏజెంట్'

AGENT shooting starts from today
  • సురేందర్ రెడ్డి కొత్త ప్రయోగం 
  • డిఫరెంట్ లుక్ తో అఖిల్
  • పాత్ర కోసం సిక్స్ ప్యాక్
  • రెగ్యులర్ షూటింగు మొదలు  
టాలీవుడ్ దర్శకులలో సురేందర్ రెడ్డికి ఓ ప్రత్యేకత ఉంది. హీరోలను ఆయన ఎంతో స్టైలీష్ గా చూపిస్తాడు. అప్పటివరకూ సినిమాలు చేస్తూ వచ్చిన హీరోలు, ఆయన సినిమా దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా డిఫరెంట్ లుక్ తో షాక్ ఇస్తారు. అలా అఖిల్ ను కూడా సురేందర్ రెడ్డి కొత్తగా చూపించనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్ పైకి వెళ్లడానికి 'ఏజెంట్' కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. కరోనా ప్రభావం చాలావరకూ తగ్గడంతో, ఈ రోజున ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగిపోయింది. ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది.సురేందర్ రెడ్డి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించాడు. సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాల్లో చాలావరకూ భారీ విజయాలను అందుకున్నవే. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాతో, కథానాయికగా 'సాక్షి వైద్య' పరిచయం కానుందనే టాక్ వినిపిస్తోంది.
Akhil
Sakshi Vaidya
Surendar Reddy

More Telugu News