మళ్లీ పట్టాలెక్కుతున్న విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్

11-07-2021 Sun 09:14 | Both States
  • ఈ నెల 15 నుంచి మళ్లీ సేవలు ప్రారంభం
  • సాయంత్రం 6.40 గంటలకు విశాఖలో బయలుదేరనున్న రైలు
  • తర్వాతి రోజు ఉదయం 7.25 గంటలకు కాచిగూడ రాక
విశాఖపట్టణం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ నెల 15 నుంచి ఈ రైలు సేవలు మళ్లీ ప్రారంభం కానున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ప్రయాణికుల నుంచి ఆదరణలేని కొన్ని రైళ్లను రైల్వే ఇటీవల రద్దు చేయగా, అందులో విశాఖపట్టణం-కాచిగూడ రైలు కూడా ఉంది. అయితే, ప్రస్తుతం మళ్లీ పరిస్థితులు కుదుటపడి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో దానిని మళ్లీ పట్టాలెక్కిస్తోంది.

గురువారం సాయంత్రం 6.40 గంటలకు రైలు విశాఖలో బయలుదేరి శుక్రవారం ఉదయం 7.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 16న సాయంత్రం 6.25 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మల్కాజిగిరిలలో ఆగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.
VisakhapatnamKachigudaIndian Railways

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more