Eatala Rajendar: నాడు నోరు మూసుకుని ఉండుంటే నేడు నా పదవి ఎక్కడికీ పోయేది కాదు: ఈటల

హుజూరాబాద్ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నేతలపై మరోసారి ధ్వజమెత్తారు. టికెట్ ఇచ్చిన వాళ్లే నన్ను ఓడించాలని చూశారని విమర్శించారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ నా ఇంటిపై పోలీసులతో దాడి చేయించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఎందుకని భావించానని ఈటల వెల్లడించారు. గుట్టలు, ఉపయోగంలేని భూములు, రైతుబంధు... భూస్వాములకు ఇవ్వొద్దని చెప్పానని తెలిపారు. నాడు నోరు మూసుకుని ఉండుంటే నేడు తన పదవి ఎక్కడికీ పోయేది కాదని అన్నారు.
Eatala Rajendar
TRS Leaders
Govt
Minister
BJP
Telangana

More Telugu News