లోక్ సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు... రఘురాజుపై వేటు వేయాలని మరోసారి విజ్ఞప్తి
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు
- ఆధారాలను అందించిన వైసీపీ ఎంపీలు
- 19 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాలు
అనంతరం మీడియాతో వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు పాల్పడుతున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్ కు అందించామని తెలిపారు. రఘురాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈరోజు మరోసారి కోరామని చెప్పారు. కాగా, ఈ నెల 19 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.