బెంగళూరులో రద్దీ రోడ్డుపై దారుణం.. ఓ వ్యక్తిని నరికి చంపిన దుండగులు

six men killed a man in day light in Bengalugu
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • అందరూ చూస్తుండగానే దారుణం
  • పాత కక్షలే కారణమన్న పోలీసులు
బెంగళూరులో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆరుగురు వ్యక్తులు కలిసి అతడిని నరికి చంపారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్నాయి.

రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు ఎక్కేందుకు వస్తున్న వ్యక్తిపై అక్కడే కాపుకాసిన దుండగులు హఠాత్తుగా దాడిచేశారు. కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. ఆ సమయంలో వాహనాలతో రోడ్డు రద్దీగా ఉంది. బాధితుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని లక్కసంద్రకు చెందిన మదన్‌గా గుర్తించారు. పాత కక్షలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Go Back to Shorts
Bengaluru
Murder
Crime News

More Telugu News