సూది గుచ్చే తీరులో తేడాల వల్లే రక్తం గడ్డలు కట్టే ప్రమాదం: నూతన అధ్యయనం వెల్లడి

04-07-2021 Sun 14:25 | Science
  • ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
  • బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతున్నట్టు ఫిర్యాదులు
  • తాజాగా మ్యూనిచ్ వర్సిటీ అధ్యయనం
  • సూదిని కండరంలోకి ఎక్కించాలని వెల్లడి
  • రక్తనాళాల్లోకి ఎక్కిస్తే బ్లడ్ క్లాట్స్ వస్తాయని వివరణ
ఇటీవల కొన్ని ఫార్మా సంస్థలు అభివృద్ధి చేసిన కరోనా టీకాలు తీసుకుంటే రక్తంలో గడ్డలు (బ్లడ్ క్లాట్స్) కడుతోందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. దాంతో అనేక దేశాలు ఆ వ్యాక్సిన్ల డోసులను తిప్పి పంపాయి. అయితే, రక్తంలో గడ్డలు కట్టడం అనేది వ్యాక్సిన్ వల్ల కాదని, వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు సూది గుచ్చే తీరులో తేడాల వల్లేనని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది.

వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఇంజెక్షన్ ను కండరంలోకి ఎక్కించాల్సి ఉంటుందని, అయితే పొరపాటున అది రక్తనాళాల్లోకి ఎక్కించినప్పుడు రక్తం గడ్డలు కడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు జర్మనీలోని మ్యూనిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయ్యాక ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్, మరికొన్ని వ్యాక్సిన్ల విషయంలో ఈ బ్లడ్ క్లాట్స్ ఫిర్యాదులు వినిపించాయి. వీటినే వైద్య పరిభాషలో పోస్ట్ వ్యాక్సినేషన్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ సిండ్రోమ్-టీటీఎస్ లేక, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనియా-వీఐటీటీ అంటారు. అయితే ఇది వ్యాక్సిన్ మందు వల్ల కాదని, వ్యాక్సిన్ ఎక్కించడంలో తేడా వల్ల ఉత్పన్నమయ్యే సమస్య అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
Blood ClotsCorona VaccineInjectionMuscleVeinsStudy

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more