Chiranjeevi: తెలుగమ్మాయి శిరీష బండ్ల‌కు చిరంజీవి శుభాకాంక్షలు!

chiranjeevi says all the best to shirisha
షార్ట్స్‌లో చూడండి
అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ నెల 11న ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపబోతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరితో కలిసి తెలుగు మూలాలున్న యువతి శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతుండ‌డంతో ఆమెకు తెలుగు వారి నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ వ‌స్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఆమె గొప్ప కార్యానికి సిద్ధ‌మైంద‌ని ఆయ‌న అన్నారు. తార‌ల‌ను చేరుకుంటోన్న మొద‌టి తెలుగు అమ్మాయి శిరీష అని ఆయ‌న గుర్తు చేశారు. ఆమె త‌ల్లిదండ్రులు, తెలుగువారితో పాటు భార‌తీయులంద‌రూ గ‌ర్వ‌ప‌డే స‌మ‌యం ఇది అని ఆయ‌న అన్నారు. ఈ మిష‌న్ విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతున్న తొలి తెలుగమ్మాయి శిరీష కి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Go Back to Shorts
Chiranjeevi
Tollywood
Andhra Pradesh

More Telugu News