Akhil: శ్రీను వైట్లకు అఖిల్ గ్రీన్ సిగ్నల్?

 Akhil in Srinu Vaitla Direction
షార్ట్స్‌లో చూడండి
అఖిల్ మొదటి సినిమాతోనే నటన పరంగా .. డాన్స్, ఫైట్స్ పరంగా తనను తాను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయనకి కావలసింది భారీ హిట్టు మాత్రమే. ఆ సమయం కోసమే ఆయన చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక వచ్చేనెల నుంచి ఆయన తాజా చిత్రం మొదలుకానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాకి 'ఏజెంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

ఇక ఈ నేపథ్యంలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నట్టుగా తాజాగా ఒక వార్త షికారు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారని చెప్పుకుంటున్నారు. శ్రీను వైట్ల చెప్పిన కథ మైత్రీవారికి నచ్చిందని అంటున్నారు. ఇక అఖిల్ కి కథను వినిపించవలసి ఉందని చెబుతున్నారు. మైత్రీవారు ఆల్రెడీ అఖిల్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారనీ .. ఈ ప్రాజెక్టు ఆయన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Go Back to Shorts
Akhil
Srinu Vaitla
Surendar Reddy

More Telugu News