తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా
- న్యుమోనియాతో బాధపడుతున్న నసీరుద్దీన్ షా
- చికిత్సకు బాగా స్పందిస్తున్నారన్న ఆయన మేనేజర్
- ప్రస్తుతం ఆయన బాగున్నారన్న భార్య రత్న
నిన్ననే ఆయనను ఆసుపత్రిలో చేర్పించామని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా ఆయన బాధ పడుతున్నారని చెప్పారు. మరోవైపు బాలీవుడ్ నటి మందిరా బేడీ భర్త ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారు.