Raja Singh: బీహార్ లో బాంబులు పేలితే హైదరాబాదులో అరెస్టులు జరుగుతున్నాయి: రాజాసింగ్

Hyderabad became as Bombs manufacturing city says Raja Singh
  • హైదరాబాద్ బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది
  • ఇక్కడ బాంబులు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు
  • రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోంది?
హైదరాబాద్ నగరం నాటు బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బీహార్ లో బాంబు పేలుళ్లు జరిగితే... హైదరాబాదులో అరెస్ట్ లు జరిగాయని... ఇక్కడ అసలేం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ బాంబులు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
 
హైదరాబాదులో జరిగిన అరెస్ట్ లకు సంబంధించి నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని మండిపడ్డారు. పాతబస్తీలో బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎన్నున్నాయో హోంమంత్రి, పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. బాంబు పేలుళ్ల వెనుక రాజకీయ ప్రమేయం ఉందా? ఒకవేళ ఉంటే ఏ ఆర్గనైజేషన్ ప్రమేయం ఉందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు.
Raja Singh
BJP
Hyderabad
Bombs

More Telugu News