లాకప్ డెత్ మృతురాలు మరియమ్మ కుటుంబాన్ని ఆదుకున్న తెలంగాణ సర్కారు
- ఇటీవల లాకప్ లో మరణించిన మరియమ్మ
- రాజకీయ దుమారం రేపిన ఘటన
- కోమట్లగూడెంలో పర్యటించిన మంత్రి పువ్వాడ
- మరియమ్మ కుటుంబ సభ్యులకు సాయం అందజేత
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, మరియమ్మ మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.