డబ్ల్యూటీసీ ఫైనల్: ఆట ఆరంభంలోనే కోహ్లీ అవుట్
- సౌతాంప్టన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్
- భారత్ వర్సెస్ న్యూజిలాండ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
- ఆదుకున్న కోహ్లీ-రహానే జోడీ
- జోడీని విడదీసిన జేమీసన్
భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ 34, శుభ్ మాన్ గిల్ 28 పరుగులు చేశారు. పుజారా 8 పరుగులకే అవుట్ కాగా, కోహ్లీ-రహానే జోడీ కీలక భాగస్వామ్యంతో జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ జోడీని జేమీసన్ విడదీశాడు. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే