కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ తెలంగాణ కేబినెట్

19-06-2021 Sat 20:33 | Both States
  • కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ ఆధునికీక‌ర‌ణ‌కు ఆమోదం
  • ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని నిర్ణ‌యం
  • టిమ్స్ దవాఖానాను సూపర్ స్పెషాలిటీ దవాఖానాగా అధునికీకరణ‌
  • ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం  
తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునికీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానాను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానాగా ఆధునికీకరించాలని, దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించి, మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది.

వీటిలో చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో ఒకటి, ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మూడవది. టిమ్స్ ను కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో గత సంవత్సరం వరి ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పైచిలుకుగా ఉందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ఈసారి ఇప్పటికే ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయని, గత సంవత్సరం కంటే 5 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యిందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు వివరించింది.
 
గత సంవత్సరంలో పండిన వరిధాన్యంలో 1.4 కోట్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని, సొంత అవసరాల కోసం ప్రజలు ఉపయోగించుకున్నారని, మార్కెటింగ్ శాఖ వివరించింది. ఈ వానాకాలం ఇప్పటికే రైతుబంధు పైసలు, 5145 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమయ్యాయని వ్యవసాయ శాఖ తెలిపింది.
 
ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలో కూడా ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి మరియు సంబంధిత శాఖల అధికారులను సిబ్బందిని కేబినెట్ అభినందించింది.
 
గొర్ల పెంపకం వృత్తిలో వున్న యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణులకోసం, గతంలోనే నిర్ణయించిన ప్రకారం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను గ్రామాల్లో తక్షణమే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
 
గీత కార్మికులకు, చేనేత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సివున్న ఎక్స్ గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కార్పోరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది.
 
రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
TelanganaTelangana CabinetKCR

More Telugu News

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29
..more