'సర్కారువారి పాట'కి హిట్ తప్పదంటున్న తమన్!
Add ap7am to your home Screen

'సర్కారువారి పాట'కి హిట్ తప్పదంటున్న తమన్!

Thaman says about Sarkaruvaari Pata movie
  • కరోనా కారణంగా ఆగిన షూటింగు
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు
  • సాంగ్స్ బాగా వచ్చాయంటున్న తమన్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అట
మహేశ్ బాబు కథానాయకుడిగా 'సర్కారువారి పాట' రూపొందుతోంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను దుబాయ్ లో పూర్తిచేశారు. భారీ యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతూ ఉండగా, కరోనా ఉద్ధృతి పెరగడం వలన షూటింగు ఆగిపోయింది.

ఇక ఇప్పుడు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలోనే మళ్లీ షూటింగు మొదలుకానుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తను చేస్తున్న సినిమా గురించి మాట్లాడటం తమన్ కి అలవాటు. అలా తాజాగా ఆయన 'సర్కారువారి పాట'ను గురించి మాట్లాడాడు.

"ఈ సినిమా కోసం చేసిన సాంగ్స్ మహేశ్ అభిమానుల్లో మరింత జోష్ పెంచేలా వచ్చాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది .. అందులో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ ప్రాజెక్టుపైకి మహేశ్ బాబు వెళ్లనున్నాడు.
Mahesh Babu
Keerthi Suresh
Parashuram

More Telugu News