Andhra Pradesh: ఏపీలో కొత్తగా 8,110 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

AP Corona Second Wave daily cases update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 97,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,416 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,042 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 235 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది.

అదే సమయంలో 12,981 మంది కరోనా నుంచి కోలుకోగా, 67 మంది మరణించారు. ఇటీవల కాలంలో ఇవే అతి తక్కువ రోజువారీ మరణాలు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది కన్నుమూశారు. దాంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 11,763కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,87,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16,77,063 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 99,057 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Update
New Cases
Second Wave

More Telugu News