పండంటి ఆడబిడ్దకు జన్మనిచ్చిన హ్యారీ, మేఘన్!
- రాచరిక హోదా వదులుకున్న హ్యారీ, మేఘన్
- ప్రస్తుతం అమెరికాలో నివాసం
- కొత్త శిశువుకు లిలిబెత్ లిల్లీ డయానాగా నామకరణం
- ఈ దంపతులకు ఇప్పటికే ఆర్చీ అనే అబ్బాయి
కొత్త శిశువుకు ‘లిలిబెత్ లిల్లీ డయానా మౌంట్‌బ్యాటెన్-విండ్సర్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం లిలిబెత్, హ్యారీ తల్లి డయానా గౌరవార్థం ‘డయానా’ను కొత్త శిశువు పేరులో చేర్చారు. ఎలిజబెత్ రాణిని రాజ కుటుంబీకులు ముద్దుగా లిలిబెత్ అని పిలుచుకుంటుంటారు.
హ్యారీ-మేఘన్ దంపతులకు ఇప్పటికే ఆర్చీ అనే అబ్బాయి ఉన్నాడు. అతను 2019లో జన్మించారు. రాజకుటుంబంలో యూకే వెలుపల పుట్టిన తొలి వ్యక్తి లిల్లీయే కావడం విశేషం. రాజ కుటుంబంతో తెగతెంపులు చేసుకున్న తర్వాత వీరివురు అమెరికాలో నివాసముంటున్న విషయం తెలిసిందే.